చీరాల సమీపంలో వాడరేవు - పిడుగురాళ్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరీష్, నవీన్ కుమార్ తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
క్షతగాత్రులను చీరాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. పిడుగురాళ్ల నుంచి వాడరేవు బీచ్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. స్టీరింగ్ ఒక్కసారిగా పక్కకు తిరగడంతోనే కారు డివైడర్‌ను ఢీకొట్టిందని పోలీసులు గుర్తించారు.

