
కసుమూరు దర్గాలో ప్రతిష్టాత్మకంగా జరిగే 249వ ఉరుసు షరీఫ్ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల తేదీలను నిర్వాహకులు ప్రకటించారు. దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.



















