బాపట్ల, 8 September
పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, యువత పెడదారి పట్టకుండా ఇంటి నుంచే సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని చిలకలూరిపేట టౌన్ సీఐ రమేష్ సూచించారు. స్మార్ట్‌ఫోన్, స్నేహితుల ప్రభావంపై దృష్టి సారించాలని ఆయన కోరారు.
*చిలకలూరిపేట పట్టణ తల్లిదండ్రులకు సీఐ రమేష్ ముఖ్య సూచనలు* పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చిలకలూరిపేట టౌన్ సీఐ రమేష్ సూచించారు. యువత పెడదారి పట్టకుండా ఇంటి నుంచే సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని కోరారు. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వినియోగాన్ని గమనించాలి పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనేది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. స్క్రీన్ టైమ్‌పై పరిమితులు విధించాలి. స్నేహితుల ప్రభావంపై దృష్టి పెట్టాలి పిల్లల స్నేహితులు, వారి అలవాట్లను తల్లిదండ్రులు గమనించాలి. చెడు వ్యసనాలు, ర్యాష్ డ్రైవింగ్‌కు స్నేహితుల ప్రభావం కారణం కావొచ్చు. ప్రవర్తనలో మార్పులను నిర్లక్ష్యం చేయకండి ఒంటరిగా ఉండటం, విపరీతమైన కోపం, నిద్రలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే పిల్లలను మందలించకుండా ప్రేమగా మాట్లాడి సమస్య తెలుసుకోవాలి. భయపెట్టకుండా భరోసా ఇవ్వాలి తాము చేసిన తప్పులను కూడా తల్లిదండ్రులతో స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణం కల్పించాలి. “ఏం జరిగినా మేమున్నాం” అనే ధైర్యం పిల్లలకు ఇవ్వాలి. అతిగారాబం వద్దు పిల్లలు అడిగిన ప్రతిదీ వెంటనే కొనివ్వడం కంటే, అవసరమైనప్పుడు ‘వద్దు’ అని చెప్పడం నేర్పాలి. ఇది భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది. నేరం జరిగిన తర్వాత పోలీసులను ఆశ్రయించడం కంటే, పిల్లలు నేరాల వైపు వెళ్లకుండా ముందుగానే సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం ముఖ్యమని సీఐ రమేష్ తెలిపారు. పిల్లల ప్రవర్తనలో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే స్పందించి, అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచించారు.సమస్య ఏదైనా చిలకలూరిపేట పోలీసు శాఖ ప్రజలకు అండగా ఉంటుందని సీఐ రమేష్ భరోసా ఇచ్చారు.



