హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ మరియు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటిని వారి కార్యాలయంలో జాతీయ మహిళా విభాగం ఈసీ సభ్యురాలు భవాని లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంస్థ భవిష్యత్తు కార్యాచరణ, హక్కుల పరిరక్షణ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు మరియు కౌన్సిల్ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు.
టీవీ ఛానల్ రూపకల్పనపై చర్చ
సమాజంలో మానవ హక్కులపై అవగాహన పెంచడం మరియు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా త్వరలోనే ప్రారంభించనున్న నేషనల్ టీవీ ఛానల్ రూపకల్పన, ప్రసారాల ప్రిపరేషన్‌పై ప్రత్యేకంగా మాట్లాడారు.
సేవల విస్తరణకు హామీ
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాను మరింత బలోపేతం చేస్తూ, త్వరలో రాబోతున్న టీవీ ఛానల్ ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా విస్తృత స్థాయిలో సేవలు అందిస్తామని ఈ సందర్భంగా జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది.
సమావేశంలో పాల్గొన్న నాయకులు
ఈ సమావేశంలో కౌన్సిల్ ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.









