బాపట్ల, 10 September
కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు మార్టూరు సచివాలయం-2 సిబ్బంది అండగా నిలుస్తున్నారు. సాధారణ పని సమయం ముగిసినప్పటికీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది అందుబాటులో ఉంటూ పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయడంలో సహకరిస్తున్నారు.
పెన్షన్ల కోసం పడిగాపులు… ప్రజల కోసం అదనపు సమయం! పని వేళలు ముగిసినా అర్హులైన లబ్ధిదారుల కోసం మార్టూరు సచివాలయం-2 సిబ్బంది సేవలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి దరఖాస్తును ఆన్లైన్ చేస్తాం: డిజిటల్ అసిస్టెంట్ మార్టూరు: కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు మార్టూరు సచివాలయం-2 సిబ్బంది అండగా నిలుస్తున్నారు. సాధారణ పని సమయం ముగిసినప్పటికీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది అందుబాటులో ఉంటూ పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయడంలో సహకరిస్తున్నారు. పెన్షన్ కోసం అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అవసరమైన పత్రాలతో సచివాలయాన్ని సంప్రదించాలని సిబ్బంది సూచిస్తున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేస్తామని డిజిటల్ అసిస్టెంట్ స్పష్టం చేశారు. ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారు నేరుగా సచివాలయ సిబ్బందిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. పని వేళలు దాటినా ప్రజల కోసం సేవలందిస్తున్న మార్టూరు సచివాలయం-2 సిబ్బంది తీరుపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.












