YSR Kadapa/Pendlimarri (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 13
వినాయక చవితి పండుగ, రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిమడలం గ్రామంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్.ఐ. తులసి నాగ ప్రసాద్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
వినాయక చవితి, రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించిన పెండ్లిమర్రి ఎస్.ఐ* వినాయక చవితి పండుగతో పాటు రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిమడలం గ్రామంలో గ్రామస్తులకు ఎస్.ఐ. తులసి నాగ ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో శాంతి, సామరస్యాలను కాపాడేందుకు పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎలాంటి సమస్యలు, వివాదాలు తలెత్తినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.











