కందుకూరు, 13 September
నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సంప్రదాయంలో తొలిపూజ విఘ్నేశ్వరుడికే అని ఆయన పేర్కొన్నారు. అందరి జీవితాలలో కష్టాలు తొలగి విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.
ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఇంటూరి క్రౌన్ హ్యూమన్ రైట్స్, నియోజవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా, తొలిపూజ చేసేది ఆ విఘ్నేశ్వరుడికే అన్నారు.అందరి జీవితాలలో కష్టాలనే విఘ్నాలను తొలగించి, సరికొత్త విజయాలకు నాంది పలికే గణేశుడి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంతోషాలతో, ఐకమత్యంతో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో శోభిల్లాలని ఆకాక్షించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులకు మేలు జరిగేలా బొజ్జ గణపయ్య ఆశీర్వాదాలు అందించాలని కోరుకున్నారు.












