నారాయణవనం, 14 September
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీ దూండి వినాయక స్వామివారిని, అలాగే మెయిన్ బజార్ వీధిలో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుని విగ్రహాన్ని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, స్వామివారి దర్శనం కల్పించారు.
గణనాథుని సేవలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించిన ఉత్సవ నిర్వాహక తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని మండల కేంద్రంలో కొలువుదీరిన ప్రసిద్ధ శ్రీ దూండి వినాయక స్వామివారిని, అలాగే మేజర్ పంచాయతీ మెయిన్ బజార్ వీధిలోని పాత ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుని విగ్రహాన్ని సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం సోమవారం ఉదయం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా రెండు ప్రాంతాల్లోని వినాయక ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఘన స్వాగతం పలికి, స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం నిర్వాహక సంఘం సభ్యులు ఎమ్మెల్యేను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, స్వామివారి మహా ప్రసాదాన్ని అందజేగణనాథుని కరుణాకటాక్షాలతో సత్యవేడు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వామివారిని ప్రార్థించారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు కలగాలని, నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీ దూండి వినాయక ఆలయ నిర్వాహకులు, మాజీ సర్పంచ్ కేజీ గణేషన్–శారదమ్మ దంపతుల తనయులు కేజీ లక్ష్మణ్, కేజీ రామన్, మెయిన్ బజార్ వీధి వినాయక ఉత్సవ నిర్వాహకులు హరినాధ్, బాలమురుగన్, శోభన్ బాబు, ఇ. వేణుగోపాల్, రాము షేడ్, ఆనంద్ శెట్టి, చిన్న దొర, పెద్ద దొరతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.












