బుచ్చినాయుడు కండ్రిగ, 13 September
తిరుపతి జిల్లా, బుచ్చినాయుడు మండలం ప్రజలందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు చెంచు రామానాయుడు, తిరుపతి జిల్లా టీడీపీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తీక్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా నిర్వహించుకోవాలని వారు కోరారు.
*వినాయక చవితి పండుగను సుఖసంతోషాలతో ప్రశాంతంగా జరుపుకోవాలి టీడీపీ నేతల పిలుపు* క్రౌన్ హ్యూమన్ రైట్స్! బుచ్చినాయుడు మండలం (తిరుపతి జిల్లా) ప్రజలందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు చెంచు రామానాయుడు మరియు తిరుపతి జిల్లా టీడీపీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తీక్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండల ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఎంతో సంతోషంతో ఈ పండుగను నిర్వహించుకోవాలని కోరారు. ఉత్సవాల సమయంలో ఎటువంటి గొడవలకు, అపశ్రుతులకు తావులేకుండా, అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని వారు ఆకాంక్షించారు.











