ప్రధానమంత్రి సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం కింద ఇంకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇంకొల్లు ఒకటి సచివాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ రావు రోగులను పరీక్షించి, వారికి తగు చికిత్స అందించారు. ఈ క్యాంపును జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాల బ్రహ్మంగారు తనిఖీ చేశారు.
ప్రధానమంత్రి సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం కింద ఇంకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇంకొల్లు ఒకటి సచివాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఇంకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ రావు రోగులను పరీక్షించి, వారికి తగు చికిత్స అందించారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి ఎఫ్డిపి నోడల్ ఆఫీసర్ డాక్టర్ బాల బ్రహ్మంగారు తనిఖీ చేశారు. క్యాంపు తీరుతెన్నులను, సంబంధిత దస్త్రాలను, రికార్డులను పరిశీలించి, ఆయన తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ కోటేశ్వరరావు, పిహెచ్ఎన్ సహస్ర, ఏఎన్ఎంలు, ఆశాలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

