చీరాల, 2026-08-27
చీరా పటోటణ సమీపంని రామాపురం బీచో రడోడు నూతనంగా ఏరోపాటు చేసిన కరో బోరీజో రిసారోటో పోరారంభతోసవం గురువారం ఘనంగా జరిగింది. రిసారోటో నిరోవాహకుు మదోదా హేమంతో కుమారో ఆధోవరోయం జరిగిన ఈ కారోయకోరమానికి పువురు పోరముఖుు హాజరయోయారు.
చీరాల పట్టణ సమీపంలోని రామాపురం బీచ్ రోడ్డులో, సీ బ్రీజ్ రిసార్ట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోరల్ బ్రీజ్ రిసార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. రిసార్ట్ నిర్వాహకులు మద్దాల హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, హేమంత్ కుమార్ స్నేహితులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఉదయం సంప్రదాయబద్ధంగా హోమ కార్యక్రమంతో ప్రారంభమైన వేడుకలు, అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా రిసార్ట్ ప్రాంగణం అతిథులతో సందడిగా మారింది. రాజకీయ, పారిశ్రామిక, వైద్య, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, హేమంత్ కుమార్‌ను అభినందించి, నూతన రిసార్ట్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
కోరల్ బ్రీజ్ రిసార్ట్ ద్వారా చీరాలరామాపురం బీచ్ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు, స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన వసతి, ఆతిథ్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు రిసార్ట్ నిర్వాహకులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన భోజన కార్యక్రమంలో ప్రముఖులు, స్నేహితులు, ఆత్మీయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హేమంత్ కుమార్ మాట్లాడుతూ, తన ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆదరణ, సహకారంతో కోరల్ బ్రీజ్ రిసార్ట్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.








