ఢిల్లీ / చీరాల, 2024-08-15
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పిలుపునిచ్చారు. ఆయన సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ దేశ ప్రజలకు సందేశం అందించారు.

ప్రధాని పిలుపు
ఈ స్వాతంత్య్ర దినోత్సవాన ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను గర్వంగా ఎగురవేద్దాం. ఈ జెండా పండుగను ఘనంగా జరుపుకుందాం. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పిద్దాం. వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ప్రతిజ్ఞ చేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.
ముఖ్య నినాదం
హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ చాటాలని మోదీ కోరారు.