బాపట్ల, 2026-11-20
రాబోయే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షుడు షేక్ మౌలాలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు ఆదరించి, ఘన విజయం అందించాలని బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా షేక్ మౌలాలి విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావాలంటే ప్రజల సమస్యలపై అవగాహన కలిగి, బాధ్యతతో పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు. గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు తమ విలువైన ఓటు వేసి విజయపథంలో నడిపించాలని కోరారు.







