బాపట్ల, 2026-11-25
సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించడం మనందరి బాధ్యత అని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ఆయన పోస్టర్లను ఆవిష్కరించారు.
సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించడం మనందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా నిర్మూలన దినోత్సవ పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా నిర్మూలన దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా వంద దేశాలకు పైగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు, గౌరవాన్ని కల్పించిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ కోసం కఠిన చట్టాలు, దిశ, శక్తి, సఖి, వన్ స్టాప్ కేంద్రాలు మరియు హెల్ప్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చాయని, జిల్లాస్థాయిలో మహిళా భద్రత, బాలికల విద్య మరియు సామాజిక చైతన్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆలోచనా విధానంలో మార్పు అవసరం
అయితే చట్టాలతో పాటు సమాజంలో ఆలోచనా విధానంలో మార్పు రావాలి. భౌతిక, మానసిక వేధింపులతో పాటు నేటి డిజిటల్ యుగంలో మహిళలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులను అరికట్టేందుకు యువత, విద్యార్థులు చైతన్యవంతులు కావాలని అన్నారు.
జిల్లా కలెక్టర్‌తో కలిసి నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్, బాపట్ల జిల్లా చైర్మన్, భావపురి ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ ఆవల వెంకటేశ్వర్లు, రోస్ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ పొందుగల ప్రసాదు పోస్టర్లను విడుదల చేశారు.







