చీరాల, 2026-11-26
సాల్మన్ సెంటర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థిని షేక్ రేష్మ కోరారు.
సాల్మన్ సెంటర్ గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థిని షేక్ రేష్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, గురువారం చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
కత్తెర గుర్తుకే ఓటు వేయాలి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ నెల 29వ తేదీన జరగనున్న గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తనకు ప్రాధాన్యత క్రమంలో రెండవ నంబర్ కత్తెర గుర్తు కేటాయించారని తెలిపారు. గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తును గుర్తుంచుకుని, తమ అమూల్యమైన ఓటును వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యల పరిష్కారానికి హామీ
తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామంలోని రహదారుల అభివృద్ధి, మురుగునీటి పారుదల సౌకర్యం, విద్యుత్ సమస్యల పరిష్కారంతో పాటు, నిరుపేదలకు అర్హత ప్రాతిపదికన ఇంటి స్థలాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే, అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నెలవారీ పింఛన్లు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటా
గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అభిమానులు, మద్దతుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


