కొడవలూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 23
కొడవలూరు మండలం నార్త్‌రాజుపాళెం పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, సర్పంచ్ స్థానంతో పాటు అన్ని వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా సమన్వయంతో పనిచేయాలని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ కుటుంబ సభ్యురాలు సుప్రజను సర్పంచ్ అభ్యర్థిగా పరిచయం చేశారు.
కొడవలూరు మండలం నార్త్‌రాజుపాళెం పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, సర్పంచ్ స్థానంతో పాటు అన్ని వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం నార్త్‌రాజుపాళెంలో కూటమి నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తమ్ముడు శ్రీధర్‌రెడ్డి సతీమణి సుప్రజను సర్పంచ్ అభ్యర్థిగా స్థానిక నాయకులకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. నార్త్‌రాజుపాళెం పంచాయతీ ఎన్నికలను తాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నానని, అందుకే జడ్పీ ఛైర్మన్ కుటుంబాన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. తన కోరిక మేరకే సుప్రజ సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. తాను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నానో, ఇక్కడున్న ప్రతి కూటమి నాయకుడు, కార్యకర్త కూడా అదే విధంగా తీసుకుని సుప్రజను గెలిపించాలని కోరారు.
సర్పంచ్‌తో పాటు అన్ని వార్డులపై దృష్టి
ఇటీవల ఇక్కడ ఎంపీటీసీ స్థానాన్ని కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే గారు, గతంలో ఏం జరిగిందనే దానికంటే ఇప్పుడు ముందున్న పంచాయతీ ఎన్నికలే మన లక్ష్యమని స్పష్టం చేశారు. సర్పంచ్ స్థానంతో పాటు అన్ని వార్డులనూ కూటమి అభ్యర్థులే గెలుచుకునేలా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.
టీడీపీలోకి మూడు వైసీపీ నాయకుల కుటుంబాలు
ఈ సమావేశం అనంతరం వైసీపీకి చెందిన మూడు నాయకుల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. పెద్దిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, పోకూరు రాఘవుల నాయుడు, జాన మహేష్‌లకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ నాయకులు పోలంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మండిపాటి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.



