బాపట్ల, 2026-11-20
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని వాడరేవు గ్రామపంచాయతీ ఎంపీటీసీ-1 సభ్యుడిగా బలగం వెంకటేశ్వరరావు గురువారం చీరాల ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంపీటీసీ-1 పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
స్థానిక శాసనసభ్యుని సహకారంతో పాటు కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలను తీసుకొని ఎంపీటీసీ1 పరిధిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించి పనిచేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
జనంలోనే ఉంటా, జనంతోనే నడుస్తా, ప్రజల కోసమే జీవిస్తా అనే నినాదంతో ప్రజాసేవకు అంకితమవుతానని బలగం వెంకటేశ్వరరావు తెలిపారు.







