నూజివీడు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
ఏలూరు జిల్లా, మండలం పల్లెర్లమూడి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఏలూరు జిల్లా, మండలం పల్లెర్లమూడి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాబోయే ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, గ్రామాభివృద్ధి పనుల కోసం తన వంతుగా రూ.1 కోటి విరాళంగా అందజేస్తానని అదే గ్రామానికి చెందిన ఎన్నారై కృష్ణ చైతన్య యనమదాల ప్రకటించారు.
ఎన్నికల సమయంలో గ్రామంలో అనవసరపు ఖర్చులు, వర్గ విభేదాలు తలెత్తకుండా, ఆ నిధులను నేరుగా గ్రామ మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించాలనే సదుద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రాంతంలో ఈ విషయంపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. పల్లెర్లమూడి గ్రామ పెద్దలు, ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ఈ కోటి రూపాయల అభివృద్ధి నిధిని దక్కించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.





