అనంతపురం, 2026-11-23
శ్రీ సత్యసాయిబాబా 101వ జయంతి సందర్భంగా పెనుకొండలోని మంత్రి సవితమ్మ గారి కార్యాలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయు అనే దివ్య సందేశంతో కోట్లాది మంది హృదయాల్లో కొలువైన మహనీయులు శ్రీ సత్యసాయిబాబా అని పేర్కొన్నారు.
మానవాళికి ప్రేమ, సేవ, మానవతా విలువలను బోధించడంతో పాటు నిస్వార్థ సేవే నిజమైన ఆధ్యాత్మికత అని తన జీవితాచరణ ద్వారా చాటిచెప్పారని తెలిపారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో శ్రీ సత్యసాయిబాబా అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయని తెలిపారు.
ఈ వేడుకల్లో పెనుగొండ మంత్రివర్యులు సబితమ్మ గారు, అనంతపూర్ జడ్పీ చైర్మన్ డా. గంజే నాగరాజు గారు, ఉమ్మడి అనంతపురం జిల్లా బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసానాయుడు గారు, శింగనమల నియోజకవర్గం టూ మెన్ కమిటీ సభ్యులు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నిర్వహించారు.


