చీరాల, 18 September
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం చీరాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రజల నుంచి నేరుగా వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 13 అర్జీలు అందాయి.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం చీరాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఈ కార్యక్రమానికి హాజరై, ప్రజల నుంచి స్వయంగా వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 13 అర్జీలు అందగా, వాటిలో ఇంటి నిర్మాణాలు, ఇంటి స్థలాలకు సంబంధించి 5, సీఎంఆర్ఎఫ్కు సంబంధించి 1, ఇతర ప్రజా సమస్యలపై 7 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసి పరిష్కారం పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, సీనియర్ నాయకుడు నాసిక వీరభద్రయ్య, పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి సురేష్, నియోజకవర్గ అధ్యక్షురాలు లలిత, మాజీ మున్సిపల్ చైర్మన్ మీంచాల సాంబశివరావు, మాజీ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, పిక్కి నారాయణ, తేలబ్రోలు నాగేశ్వరరావు, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, నాగలక్ష్మి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.











