17వ వార్డు, చీరాల (క్రౌన్ హ్యూమన్ రైట్స్) అక్టోబర్ 20
చీరాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 17వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు...
చీరాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 17వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లి, 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సలగల అమృతరావు ప్రచారంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చీరాల మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నాయకత్వంలో చీరాల మున్సిపాలిటీకి నిధులు తీసుకువచ్చి, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. చీరాల పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వారు అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లితో పాటు 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సలగల అమృతరావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.











