21వ డివిజన్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 14
నెల్లూరు నగరంలోని 21వ డివిజన్‌ను పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నూతన కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి తెలిపారు. ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. తెల్లవారుజాము నుంచే విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని ఆమె కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నగరంలోని 21వ డివిజన్‌ను పారిశుద్ధ్య నిర్వహణలో నెల్లూరు నగరానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని నూతనంగా ఎన్నికైన 21వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి స్పష్టం చేశారు. ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
తెల్లవారుజామున 5:30 గంటలకే స్థానిక చిల్డ్రన్స్ పార్క్ వద్ద విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని కార్పొరేటర్ విజయలక్ష్మి, జనసేన నాయకులు కిషోర్ గునుకుల కలిసి, వారితో కలిసి తేనీరు సేవించారు. అనంతరం డివిజన్లో విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలు, ఏయే ప్రాంతాల్లో ఎవరు పనిచేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరత, పనిముట్లు, వాహనాల లభ్యత వంటి క్షేత్రస్థాయి సమస్యలపై ఆరా తీశారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
ఈ సందర్భంగా జనసేన నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ, ప్రజలు నిద్రలేవకముందే వీధులను శుభ్రం చేస్తూ ఆరోగ్యకరమైన సమాజానికి బాటలు వేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ ఆశయాలకు అనుగుణంగా, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మార్గదర్శకత్వంలో 21వ డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని కిషోర్ గునుకుల తెలిపారు. పరిశుభ్రమైన డివిజన్ నిర్మాణం అందరి సమిష్టి బాధ్యత అని, ప్రజలు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి డివిజన్‌ను ఆదర్శంగా నిలుపుదామని కిషోర్ గునుకుల పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్, విజయ, చండ్ర మధు, శ్రీలక్ష్మి, రాజేష్ మరియు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

