ఈపూరుపాలెం, చీరాల (క్రౌన్ హ్యూమన్ రైట్స్) అక్టోబర్ 16
బీఎంఈటీ మైనారిటీ, చేనేత వర్గులకు మజయయపచ్చబీసీ జభపరతపద తగరజరవేషు అముచేయవ వధపరజఘపరతధుడమడచేశారు. చీరమీపూరు పెగురువరజరగరౌడ టేబుల్ సమావేశం నిర్వహించిన ఈమేరుతీరమచరు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, చేనేత వర్గాలకు సామాజిక న్యాయం కల్పించాలని, బీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన రిజర్వేషన్లు అమలు చేయాలని వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. చీరాల సమీపంలోని ఈపూరుపాలెంలో కుర్రికోటయ్య ప్రగడ కోటయ్య కళ్యాణ మండపంలో బీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, చేనేత సంఘాల ప్రతినిధులతో పాటు వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా వర్గాలకు జరుగుతున్న అన్యాయాలు, ఎదురవుతున్న సమస్యలపై వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా న్యాయం జరగాలంటే రిజర్వేషన్ల అమలులో పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు.
ఈ సందర్భంగా శీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలకు ఆశించిన స్థాయిలో న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా బీసీలకు రాజకీయ అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి పాలకుల్లో కనిపించడం లేదని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, చేనేత వర్గాల హక్కుల సాధన కోసం సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు పిలుపునిచ్చారు.











