చిలకలూరిపేట మున్సిపాలిటీ, చిలకలూరిపేట, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల సంభవించిన మురస తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులకు భారీ సహాయ కార్యక్రమం చేపట్టారు. స్థానిక నాయకులు, అభివృద్ధి ప్రదాత పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఎమ్మార్వో కార్యాలయం ద్వారా ఈ పంపిణీ జరిగింది.

ఇందులో భాగంగా 32, 33వ వార్డులకు చెందిన జంగాల వర్గానికి చెందిన 35 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 3,000ల నగదుతో పాటు బియ్యం, కందిపప్పు, పామాయిల్, పంచదార, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. మొత్తంగా సుమారు రూ. 1,00,000ల నగదు, రూ. 50,000ల విలువైన సరుకులను పంపిణీ చేశారు.
ఈ సహాయక కార్యక్రమంలో ఆర్ ఐ రమీజా, 33వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, 32వ వార్డు కౌన్సిలర్ షేక్ బాజీ, వీఆర్వోలతో పాటు వార్డు పెద్దలు షేక్ మౌలా, బడే, తోట బ్రహ్మ స్వాములు, షేక్ కరీముల్లా, నందం చంద్ర, షేక్ కాలేషా, షేక్ ఫాతిమా, షేక్ బుజ్జి, షేక్ ఖాదర్ సహా ఇతరులు పాల్గొన్నారు.