సిపిఐ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 23
నరసరావుపేట పట్టణ మున్సిపల్ ఎన్నికలలో 35వ వార్డులో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసా రాంబాబును గెలిపించాలని కోరుతూ, సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బైరాపట్నం రామకృష్ణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ, నరసరావుపేట పట్టణ అభివృద్ధిలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని, పట్టణ అభివృద్ధికి సీపీఐ పార్టీ కృషి చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తోందని తెలిపారు. నిరుపేదలకు పెద్ద చెరువు, లెనిన్ నగర్, ప్రశాంత్ నగర్ కాలనీల నిర్మాణంలో, ప్రభుత్వం నుంచి పట్టాలు మరియు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీపీఐ పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. పట్టణానికి త్రాగునీటి సమస్య వచ్చినప్పుడు, పరిష్కార మార్గాన్ని సిపిఐ పార్టీ ఆనాటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సూచించిందని, ఆనాటి పాలకులు సిపిఐ సూచనలు తీసుకొని త్రాగునీటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి నీరు అందించారని గుర్తు చేశారు. అయితే, ఇంకా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారంలో పాలకులు వైఫల్యం చెందారని విమర్శించారు. ఈనెల 26వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, 35వ వార్డులో సీపీఐ తరఫున పోటీ చేస్తున్న కాసా రాంబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ఈరోజు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహంకాళి సుబ్బారావు, మునుగోటి శ్రీనివాసరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చక్రవకం సత్యనారాయణ రాజు, సిపిఐ పట్టణ కార్యదర్శి, సిపిఐ రెండో వార్డ్ అభ్యర్థి షేక్ చిన్నజాన్ సైదా, సిపిఐ సీనియర్ నాయకులు, సిపిఐ మండల కార్యదర్శి రోడ్డ అంజిరెడ్డి, రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు దుగ్గిపోగు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


