కార్యక్రమంలోసిపిఎం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 23
ఈనెల 26న జరగనున్న కందుకూరు మున్సిపల్ ఎన్నికలలో 5వ వార్డు (ఉప్పుచెరువు) నుండి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి షేక్. మున్వర్ సుల్తానాకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం కందుకూరు నియోజకవర్గ నాయకులు జీ. వెంకటేశ్వర్లు ఓటర్లను కోరారు.
ఈరోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా బ్యాలెట్ పేపర్ తో ఉప్పుచెరువు మెయిన్ రోడ్డులో రెండవ దశ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉప్పు చెరువు కాలనీలో సిపిఎం పోరాటం ద్వారానే 418 మందికి ఇండ్ల పట్టాలు వచ్చాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం తాము పోరాడామని తెలిపారు.
సిపిఎం అభ్యర్థి వార్డులోని ప్రజలందరికీ సుపరిచితురాలుగా పేరు ఉన్నదని తెలిపారు. ఇవన్నీ మా గెలుపుకు తోడ్పడతాయని, ప్రజలందరూ షేక్ మున్వర్ సుల్తానాకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జీ. శ్రీనివాసులు, ఉలవపాడు వలేటివారిపాలెం ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవీబీ కుమార్, కందుకూరు పట్టణ కార్యదర్శి ఎస్. ఏ. గౌస్, సిఐటియు జిల్లా నాయకులు బి. వెంకట్రావు, పట్టణ నాయకులు ఎస్. పవన్, టి. వెంకట్రావు, ఎస్.కె. మల్లిక, ఎం. పద్మ, పర్వీన్, బీబ్ జాన్, ఎం. సుభాను, దువ్వూరు జాన్ తదితరులు పాల్గొన్నారు.



