ఆదోని, 2026-11-25
ఆదోని పట్టణంలోని 22వ వార్డుకు చెందిన దాదాపు 30 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ కొంకా మీనాక్షి నాయుడు అన్నగారి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా జయరాం, రామన్న, నాగేంద్ర, నాగరాజ్, హనుమంతు, చిరంజీవి, ఈశ్వర్, బాలు, హరి, రెహమాన్, భీమేష్, వీరేష్, వెంకటలక్ష్మి, రాధమ్మ, సంధ్య, రాజేశ్వరి, నాగమ్మ, సిద్ధమ్మ, పార్వతమ్మ, మల్లమ్మ, సుజాతతో పాటు పలువురు తమ కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారందరికీ శ్రీ కొంకా మీనాక్షి నాయుడు అన్నగారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరడం సంతోషకరమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో 23వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ శ్రీనివాస్ ఆచారి, 22వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ చాంద్ భాషా, టీడీపీ సీనియర్ నాయకులు వలి, ఈరన్న, కృష్ణ, మల్లప్ప, రాందాస్, శేఖర్ తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







