పల్నాడు, 2026-08-22
పల్నాడు జిల్లా, జె. పంగులూరు మండలం నూజిల్లపల్లి గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తహసిల్దార్ కార్యాలయంలో నిర్బంధించడంపై దళిత హక్కుల పోరాట సమితి తీవ్రంగా స్పందించింది. ఈ చర్య కూటమి ప్రభుత్వ కుల వ్యవస్థకు నిదర్శనమని, రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి స్వాతంత్రం లేదని ఆరోపించారు. స్థానిక బంగ్లా రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి, ఈ ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించాలని డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా, జె. పంగులూరు మండలం నూజిలపల్లి గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తహసిల్దార్ కార్యాలయంలో నిర్బంధించడంపై దళిత హక్కుల పోరాట సమితి తీవ్రంగా స్పందించింది. ఈ చర్య కూటమి ప్రభుత్వ కుల వ్యవస్థకు నిదర్శనమని, రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి స్వాతంత్రం లేదని ఆరోపించారు. స్థానిక బంగ్లా రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి, ఈ ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించాలని డిమాండ్ చేశారు.
విగ్రహ నిర్బంధంపై ఆరోపణలు
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర మాట్లాడుతూ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గంలోని జె. పంగులూరు మండలం నూజిల్లపల్లి గ్రామంలో, ఎస్సీ మాల కులస్తులు ప్రభుత్వ డొంక పోరంబోకు భూమిలో రెండు వారాల క్రితం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అయితే, జె. పంగులూరు తహసిల్దార్ సింగారావు, పోలీసుల సహాయంతో ఆ విగ్రహాన్ని తహసిల్దార్ కార్యాలయంలోకి తరలించి నిర్బంధించారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి సంబరాలు చేసుకుంటున్న తరుణంలో, పాలనలో ఉన్న దళితులకు అంబేద్కర్ విగ్రహానికి కూడా స్వాతంత్రం లేకపోవడం అనాగరిక, అగ్రకుల అహంకార చర్య అని ఆయన విమర్శించారు.
కుల వివక్షపై విమర్శలు
ప్రపంచ దేశాలలో అంబేద్కర్ విగ్రహాలు స్థాపితమవుతున్నాయని, ఆయన రాజ్యాంగం అమలవుతున్న భారతదేశంలోనే అంబేద్కర్ ను అంటరానివాడిగా చూడటం, కూటమి ప్రభుత్వం కుల వివక్షత పాటించడమని నాగేంద్ర అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో అనుమతి లేని ఎన్టీఆర్, వైయస్సార్, మరియు అనేకమంది స్థానిక రాజకీయ నాయకుల విగ్రహాలు ఉన్నప్పటికీ, కేవలం అంబేద్కర్ విగ్రహాలకే అనుమతులు లేవని, తెలుగుదేశం నాయకుల కనుసన్నలలో ఫ్లెక్సీలు కూడా కట్టకుండా అడ్డుకోవడం, అరెస్టులు చేయించడం దళిత వ్యతిరేక పాలనకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అద్దంకి నియోజకవర్గంలో 25 శాతం దళిత ఓటింగ్ ఉన్నప్పటికీ, అంబేద్కర్ విగ్రహాలకు అడ్డుకోవడం, ఆయనను అవమానించడంపై ప్రజలు ఆలోచించాలని కోరారు.
అధికారుల పాత్రపై అనుమానాలు
ఇటీవల అద్దంకిలో జరిగిన గ్రానైట్ వ్యాపారుల సిండికేట్ విందులో పాల్గొని, గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన పోలీసు అధికారుల విషయంలో వారం తర్వాత స్పందించిన మంత్రి గొట్టిపాటి, తన నియోజకవర్గంలో నూజిల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు, అధికారులచే అరెస్టు చేయించి, జె. పంగులూరు తహసిల్దార్ కార్యాలయంలో నిర్బంధించడం గొట్టిపాటి భూస్వామ్య విధానానికి నిదర్శనమని నాగేంద్ర విమర్శించారు. ఈ ఘటనకు ముందు, జె. పంగులూరు మండలం నూజిల్లపల్లి గ్రామానికి వెళ్లి, అంబేద్కర్ విగ్రహం మరియు ఆర్చి ఏర్పాటు స్థలాన్ని దళితులతో కలిసి నీలం నాగేంద్ర పరిశీలించారు. అంతకుముందే, దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ, అద్దంకి ఆర్డిఓ విజయ్ జ్యోతి కుమారి నూజిల్లపల్లి వచ్చి, సర్వే నెంబరు 133 ను పరిశీలించి, ఆక్రమణ స్థలాన్ని మార్కింగ్ చేసి వెళ్లారని, అయితే మంత్రి గొట్టిపాటికి భయపడి తమ నిర్ణయాన్ని ప్రకటించలేదని ఆయన అన్నారు.











