ఒంగోలు, 2026-08-17
జె.పంగులూరు మండలం నూజిళ్లపల్లి గ్రామంలో దళితులు ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు తొలగించి తహశీల్దార్ కార్యాలయంలో నిర్భందించడాన్ని నిరసిస్తూ సోమవారం ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.

అధికారులపై చర్యలకు డిమాండ్
మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్భందించిన దర్శి డీఎస్పీ, అద్దంకి ఆర్డీఓ, జె.పంగులూరు తహశీల్దార్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్కు వినతి
అనంతరం జిల్లా కలెక్టర్ రాజాబాబును కలిసి నూజిళ్లపల్లి గ్రామాన్ని సందర్శించి, అంబేద్కర్ విగ్రహం, కాలనీ ఆర్చిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారానికి రెండు రోజుల్లో అధికారులను పంపిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నీలం నాగేంద్రరావు తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో రఘురామ్, మేడికొండ మురళీ, దారా అంజయ్య, కాకుమాను రవి, పట్రా బంగారం, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.