ఒంగోలు, 2026-11-25
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ రచన చేసి, భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన వ తేదీని అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా ఘనంగా జరుపుకోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు లేకుండా, ఆయన విగ్రహాలకు నివాళులర్పించకుండా, అంబేద్కర్ పట్ల అంటరానితనం పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం వ తేదీన రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాయని నాగేంద్రరావు విమర్శించారు. అంబేద్కర్ ఫోటో లేకుండా, భరతమాత ఫోటోలకు దండ వేస్తూ మనువాదాన్ని పాటిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
దళిత ఉద్యమ పోరాటాల ఫలితంగా 2015 సంవత్సరంలో భారతదేశంలో మొదటిసారిగా అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరిపారని, అప్పటి నుండి 11 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దినోత్సవాన్ని న జరపాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు, జీవోలు విడుదల చేయకపోవడంతో ఏర్పాట్లు కూడా చేయలేదని ఆయన తెలిపారు. కావున, ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రభుత్వం ఆమోదించిన ఈ దినోత్సవాన్ని అంబేద్కర్ వాదులు, కుల సంఘాలు, రాజ్యాంగ పరిరక్షకులు పల్లె పల్లెన జరుపుకోవాలని నీలం నాగేంద్రరావు పిలుపునిచ్చారు.







