నెల్లూరు అర్బన్, 2026-11-26
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని స్థానిక వీఆర్సీ సెంటర్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని స్థానిక వీఆర్సీ సెంటర్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు కిషోర్ గునుకుల, 21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, 71వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఆలియా, 45వ డివిజన్ కార్పొరేటర్ చిత్తలూరు సుందర రెడ్డి, 15వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కేజీయా కుమారి, 30వ డివిజన్ కార్పొరేటర్ నూనె రుషికేష్ యాదవ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, ఆత్మగౌరవాన్ని కల్పించిన గొప్ప ప్రజాస్వామ్య పునాది అని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి దూరదృష్టి, కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వ స్ఫూర్తితో ప్రజాసేవ, సామాజిక బాధ్యత, సమానత్వం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ, పౌరులుగా మన బాధ్యతలను నిర్వర్తిస్తూ, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం లభించే సమాజ నిర్మాణానికి కృషి చేయడమే అంబేద్కర్ గారికి మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, 21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, 71వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఆలియా, 45వ డివిజన్ కార్పొరేటర్ చిత్తలూరు సుందర రెడ్డి, 15వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కేజీయా కుమారి, 30వ డివిజన్ కార్పొరేటర్ నూనె రుషికేష్ యాదవ్, కృష్ణ మోహన్ రెడ్డి, మల్లీ రెడ్డి, నరహరి, విశ్వనాధ్, విజయ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.






