(ఎస్ఎఫ్ఐ) (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 14
రాష్ట్రంలోని విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, ఈ విషయంలో విఫలమైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, ఈ విషయంలో విఫలమైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. శనివారం కడప నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని వీరపోగు రవి గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చి కొంతకాలం గడుస్తున్నా డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వేల కోట్ల రూపాయల బకాయిలు పూర్తిస్థాయిలో అందలేదని ఆయన విమర్శించారు. ఫీజుల చెల్లింపుల కోసం కళాశాలల యాజమాన్యాల నుండి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్న చిత్తూరు జిల్లాలోని ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కళాశాలలో యాజమాన్యం ఫీజుల కోసం ఒత్తిడి చేయడంతో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినులు ఆత్మహత్యకు ప్రయత్నించారని, అందులో ఒక విద్యార్థిని మృతి చెందడం అత్యంత బాధాకరమని రవి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత విద్యార్థినుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అఖిలేష్, నగర నాయకులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

