మండలం స్వర్ణపాలెం గ్రామంలో చౌదరి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సందడి చేశారు.
కారంచేడు కారంచేడు మండలం స్వర్ణపాలెం గ్రామంలో చౌదరి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం వినాయక మండపంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని, డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.











