మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, అక్టోబరు 2వ తేదీన చీరాల పురపాలక సంఘం పరిధిలో మాంసాహార విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ కె. డానియోల్ జోసెఫ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. అక్టోబరు 2న మాంసం, చికెన్, చేపల విక్రయ దుకాణాలను పూర్తిగా మూసివేయాలని వ్యాపారస్తులకు సూచించారు. అలాగే, హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా మాంసాహార పదార్థాల విక్రయాలను నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీ జయంతి సందర్భంగా విధించిన ఈ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించి పురపాలక సంఘానికి సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ ఆదేశాలు చీరాల పురపాలక సంఘం పరిధిలోని అన్ని వ్యాపార సంస్థలకు వర్తిస్తాయి.












