జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ కోఆర్డినేషన్ కమిటీలో తనకు స్థానం కల్పించినందుకు పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు రామ్ తాళ్లూరి, బాలినేని శ్రీనివాస రెడ్డి, పెదపూడి విజయ్ కుమార్‌లకు జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు.
తనపై నమ్మకంతో ఎన్నికల నిర్వహణ కోఆర్డినేషన్ కమిటీలో స్థానం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు, రామ్ తాళ్లూరికి, బాలినేని శ్రీనివాస రెడ్డికి, పెదపూడి విజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్ పేర్కొన్నారు. తనపై విశ్వాసంతో కీలకమైన బాధ్యతను అప్పగించిన పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వర్తిస్తూ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సవినయంగా తెలిపారు.
పార్టీ అభివృద్ధి, ఎన్నికల నిర్వహణలో సమన్వయం సాధిస్తూ, అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించడం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన నాయకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. తనకు సహకారం అందించిన పార్టీ నాయకులకు, తనపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.










