చీరాల జడ్పీటీసీ అభ్యర్థిగా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ (జేసీపీ) రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు బరిలోకి దిగారు. ఆయనకు వివిధ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా శీలం వెంకటేశ్వర్లును గెలిపించాలని బీసీ నవ చైతన్య వేదిక పిలుపునిచ్చింది.
చేనేత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బహుజన ప్రజా సంఘాల మద్దతుతో శీలం వెంకటేశ్వర్లు బరిలో నిలుస్తున్నారు. గత 20 ఏళ్లుగా చేనేత సంఘాలు, వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని బీసీ నవ చైతన్య వేదిక తెలిపింది.
అభ్యర్థి సేవలు
పేద, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే మానవతావాదిగా, స్నేహశీలిగా ఆయనకు గుర్తింపు ఉందని పేర్కొంది. మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న శీలం వెంకటేశ్వర్లును ప్రజలు ఆదరించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసింది.
బహుజన వర్గాల అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేసే నాయకుడికి ప్రజలు అండగా నిలవాలని బీసీ నవ చైతన్య వేదిక కోరింది.


