చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని జార్జి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాతపూడి దేవ సహాయం, మండలం మాజీ వైస్ ఎంపీపీ మేరీ పుష్ప అన్నారు. ఈ సందర్భంగా వారు కనిగిరి నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
జార్జి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాతపూడి దేవ సహాయం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని మండలం మాజీ వైస్ ఎంపీపీ మేరీ పుష్ప అన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం
క్రౌన్ హ్యూమన్ రైట్స్ సంస్థ తరపున అమ్మవారి ఆశీస్సులతో కనిగిరి నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నిండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో విజయం, శాంతి, సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ధర్మం గెలవాలి అధర్మం ఓడాలి ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి ప్రతి గుండెలో ఆశలు చిగురించాలి ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలి ఈ విజయదశమి పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీ కుటుంబాలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.












