నరసరావుపేట, గుంటూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ నాలుగో వర్ధంతి కార్యక్రమాన్ని నరసరావుపేటలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అమ్మా నాన్నల ప్రేమాలయం వృద్ధాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, అన్నదానం చేశారు.
నరసరావుపేట: దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ నాలుగో వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డులో ఉన్న అమ్మా నాన్నల ప్రేమాలయం వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణమహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షుడు ఎండీ ఫారూఖ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను, సినీ రంగంలో ఆయన చేసిన సాహసోపేత ప్రయోగాలను ఈ సందర్భంగా పలువురు వక్తలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ బాబు మాట్లాడుతూ, నరసరావుపేట పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ఒక్కరితో సాధ్యమయ్యేది కాదని, అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభిమాని సహకరించాలని ఆయన కోరారు. అభిమానులందరూ ఐక్యంగా ముందుకు వచ్చి విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధులకు భోజనం అందించి, సేవా కార్యక్రమంలో అభిమానులు భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వంకాయలపాటి రవి, తెలుగు సేవా సమితి అధ్యక్షుడు, అడ్వకేట్ గోదా రమేష్ కుమార్, సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ అభిమానులు బి. కొండలరావు, పద్మాలయ వేణు, లింగంగుంట్ల రాములు, ఎన్. గోపికృష్ణ, ఫోటోగ్రాఫర్ చిన్ని కృష్ణ, ఎన్. జయకృష్ణ, ఎస్.కె. సుభాని, యన్నం వీరారెడ్డి, ఎస్.కె. బాజీ, సి.హెచ్. వెంకటకృష్ణ, మన్నేపల్లి శ్రీను, ఎస్. థామస్, ఎస్.కె. సలామ్, జి. కోటేశ్వరరావు, మస్తాన్ రావు, ఆశ్రమ నిర్వాహకుడు కె. ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.


