రెడ్డిగూడెం, 15 November
క్రౌన్ హ్యూమన్ రైట్స్ పత్రికా ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసిన కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, స్వయంగా దేవాలయాలకు వెళ్లి దేవుని ఆశీస్సులు పొందారు. ఆ దైవబలంతోనే కూటమి అభ్యర్థులు విజయం సాధించారని వారు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆదివారం ఉదయం జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో కూటమి నాయకులందరూ పాల్గొన్నారు.
మండల ఎంపీపీ అభ్యర్థి ముప్పిడి నాగేశ్వర రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను నిరంతరం ప్రజల మధ్య ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పేద ప్రజలకు తన సహకారాన్ని అందిస్తానని, తాను వారందరిలో ఒకడిగా ఉంటానని వాగ్దానం చేశారు.
కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీల ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి నాగేశ్వర రెడ్డి, జానలపాటి వేణుగోపాల రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి, సోమేశ్వరరావు, మల్లాది పోతురాజు, నాగభూషణం, చాట్లా చందా, మల్లాది జగదీష్, చాట్ల ఆదాం తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


