నెల్లూరు గ్రామీణం, 16 November
నెల్లూరుకు చెందిన యువ క్రీడాకారుడు మురళీధర్ స్నూకర్ బిలియర్డ్స్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గుంటూరులోని ఎల్విఆర్ అండ్ సన్స్ క్లబ్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్నూకర్ అండ్ బిలియర్డ్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్ 21 విభాగంలో ఆయన రెండు విభాగాల్లోనూ విజయం సాధించారు.
నెల్లూరుకు చెందిన యువ క్రీడాకారుడు మురళీధర్ స్నూకర్ బిలియర్డ్స్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గుంటూరులోని ఎల్విఆర్ అండ్ సన్స్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ స్నూకర్ అండ్ బిలియర్డ్స్ రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి.
రెండు విభాగాల్లోనూ విజయం
ఈ పోటీల్లో అండర్ 21 విభాగంలో నెల్లూరుకు చెందిన మురళీధర్ రెండు విభాగాల్లోనూ తన సత్తాను చాటారు. రెండు విభాగాల్లోనూ ఘన విజయాన్ని సాధించారు. ఇలా ఒకేసారి రెండు విభాగాల్లోనూ విజయం సాధించిన తొలి క్రీడాకారుడిగా నిలిచారు.
మురళీధర్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల నెల్లూరు వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

