విశాఖపట్నం, 16 November
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ దశలో రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లోని ఎంపిక చేసిన మండలాల్లో 4,960 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ దశలో రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లోని ఎంపిక చేసిన మండలాల్లో 4,960 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. తిరస్కరించిన నామినేషన్లపై సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్లు చేసుకోవచ్చు. ఆ అప్పీళ్లను పరిష్కరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 3 గంటల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతో పాటు ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించి, అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. కాగా రెండో దశ ఎన్నికల షెడ్యూల్లో విశాఖపట్నం జిల్లాకు ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. 3వ దశలో విశాఖపట్నం జిల్లాలో 4 మండలాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. కోర్టు ఆదేశాలతో ఎన్నికలు వాయిదా పడిన పంచాయతీల్లో నోటీసులు జారీ చేయవద్దని కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది.




