ఐరాల (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
ఐరాల మండల నూతన జడ్పీటీసీగా ఎన్నికైన యువ నాయకులు మహేష్ స్వేరోను పలువురు విద్యార్థి, యువజన, సామాజిక నేతలు చిత్తూరులో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఐరాల మండల నూతన జడ్పీటీసీగా ఎన్నికైన యువ నాయకులు మహేష్ స్వేరోను పలువురు విద్యార్థి, యువజన, సామాజిక నేతలు ఘనంగా సన్మానించారు. చిత్తూరులో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నీరుగట్టు నగేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అమృత తేజ, విజయ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ విజయ్, మహేష్ స్వేరో మిత్రులు ఢిల్లీ రాజు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, మహేష్ స్వేరో చిన్న వయస్సులోనే ఉన్నత విద్యను అభ్యసించి, విద్యార్థి దశ నుండే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని కొనియాడారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పాదాల చెంత ఉన్న ఐరాల జడ్పీటీసీగా ఒక యువకుడు, విద్యావంతుడు ఎన్నిక కావడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు.
ఐరాల ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనలో మహేష్ స్వేరో కృషి చేయాలని, ఆయన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.


