Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 10
పర్చూరు నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభినందన సభను నిర్వహించనుంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రాబోయే పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించనున్నారు.
పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నాయకత్వంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్భంగా నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల అభినందన సభను నిర్వహించనున్నారు. అదేవిధంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల సమరశంఖారావ కార్యక్రమానికి కూడా సన్నద్ధం కానున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు నూతనంగా ఎన్నికైన సభ్యులందరూ, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు సకాలంలో హాజరుకావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జిలు, బూత్ ఇన్ఛార్జిలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని పేరుపేరునా కోరుతున్నాము.
ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4.00 గంటలకు ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో జరగనుంది.
మీ విజయోత్సాహంతో రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి విజయపరంపరను కొనసాగిద్దాం.






