Vijayawada, 11 November
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను విజయవాడ నూతన మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో వంగవీటి రాధాకృష్ణ, తన కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కళ్యాణ్ ను సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేసి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను విజయవాడ నూతన మేయర్ గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో వంగవీటి రాధాకృష్ణ, తన కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కళ్యాణ్ ను సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేసి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు పలు అంశాలపై సౌహార్దపూర్వకంగా చర్చించుకున్నారని సమాచారం. ముఖ్యంగా విజయవాడ నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, నగరంలో పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మేయర్ గా తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో వంగవీటి రాధాకృష్ణ ముందుకు సాగుతున్నారు. ఈ మర్యాదపూర్వక సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.






