క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-20
బాపట్ల పట్టణంలోని భీమవారి పాలెం, శ్రీ చైతన్య స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై బాపట్ల ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
బాపట్ల పట్టణంలోని భీమవారి పాలెం, శ్రీ చైతన్య స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు బాపట్ల ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక అనర్థాలను వివరించారు. ముఖ్యంగా చిన్న వయస్సులోనే చెడు అలవాట్లకు బానిసలైతే విద్యాభ్యాసం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలియజేశారు.
చెడు స్నేహాలు, తప్పుడు ప్రలోభాలు, స్నేహితుల ఒత్తిడికి లోనై గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని విద్యార్థులకు సూచించారు.
ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగానికి ప్రోత్సహించినా ధైర్యంగా తిరస్కరించాలని, అలాంటి విషయాలు తమ దృష్టికి వస్తే వెంటనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని వివరించారు.
విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, క్రీడలు, మంచి వ్యాపకాలు అలవాటు చేసుకొని లక్ష్యసాధన వైపు సాగాలని సూచించారు.


