ఓజిలి, 2026-11-25
బట్ల కనుపూరు సర్పంచ్ అభ్యర్థి గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి దేవుడు కండ్రిగలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
తిరుపతి జిల్లా ఓజిలి మండలం బట్ల కనుపూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి, దేవుడు కండ్రిగ గ్రామంలో బుధవారం ఇంటింటి ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటిస్తూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి సోదరి అరుణ రెడ్డి పాల్గొని ఆయనకు మద్దతుగా ప్రజలను కలిసి, ఒక ఓటు సర్పంచ్ అభ్యర్థికి, మరో ఓటు వార్డు సభ్యులకు వేయాలని అభ్యర్థించారు. పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ప్రచార కార్యక్రమం సందడిగా సాగింది.
గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించడం అభ్యర్థి వర్గంలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో బొచ్చల రవీంద్ర రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ గురవయ్య పాల్గొన్నారు.







