క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-24
చదువుకున్నవారికి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారికి కూటమి ప్రభుత్వం రాజకీయంగా అవకాశాలు కల్పిస్తోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కావలిలో పర్యటించిన ఆయన, ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి 26, 27 వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
చదువుకున్నవారికి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారికి కూటమి ప్రభుత్వం రాజకీయంగా అవకాశాలు కల్పిస్తోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం కావలి పట్టణంలో పర్యటించిన ఎంపీ, కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి 26, 27 వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోట సురేంద్ర రెడ్డి, 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మంద కిరణ్ కుమార్లను ప్రజలకు పరిచయం చేసిన ఎంపీ, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
గత రెండేళ్లలో కావలి పట్టణంలో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఎంపీ తెలిపారు. రానున్న రోజుల్లో కూడా కావలిని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పట్టుదల ఉన్న నాయకుడని, ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టరని ఎంపీ ప్రశంసించారు. అదే పట్టుదలతో కావలిని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. పట్టణ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కూడా సమర్థులైన ప్రజాప్రతినిధులు ఉండాలని ఎంపీ అన్నారు. అందుకోసం కూటమి తరఫున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ప్రజలు అండగా నిలవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్తో పాటు 44 వార్డుల కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, కావలి మరింత అభివృద్ధి చెందేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



