చీరాల, 2026-09-01
చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో మంగళవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. జనసేన నాయకులు కడలి లక్ష్మణ్, సచివాలయ సిబ్బందితో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జనసేన నాయకులు పేర్కొన్నారు. చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశాల మేరకు మంగళవారం చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, చీరాల పట్టణ జనసేన నాయకులు కడలి లక్ష్మణ్ సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా కడలి లక్ష్మణ్ మాట్లాడుతూ పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్థానిక సమస్యలు, కొత్త పింఛన్ల కోసం చేసుకున్న దరఖాస్తుల వివరాలపై లబ్ధిదారులతో మాట్లాడి సమాచారం సేకరించారు.
అర్హత కలిగిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, స్థానిక జనసేన నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.












