చీరాల గ్రామంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా, కళాకారిణి అన్నం మహిత శ్రీవారి జీవిత చరిత్రను పెన్సిల్ మీద చెక్కారు.
ఈ కళారూపాన్ని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారికి అందజేయగా, మహితను ఎంతో అభినందించారు.
భవిష్యత్తులో మరిన్ని కళాకార్యాలను రూపొందించాలని, ప్రభుత్వపరంగా కూడా సహాయం ఉంటుందని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు.
చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టిస్తున్న మహితపై గ్రామస్థుల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది.
చీరాల వైకుంఠపురంలో నివసిస్తున్న మహిత, తన ప్రతిభతో అందరిని ఆకర్షిస్తోంది.








