చిలకలూరిపేట, 2026-11-29
చిలకలూరిపేట నియోజకవర్గంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తిరుగులేని విజయం సాధిస్తారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలే సర్పంచ్ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ప్రత్తిపాటి పుల్లారావుతో సమావేశమై చర్చించారు.
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకేనని, మున్సిపల్, పరిషత్ ఫలితాలే సర్పంచ్ ఎన్నికల్లోనూ పునరావృతం కానున్నాయని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా టీడీపీ అధిష్ఠానం నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబును నియమించింది. ఈ సందర్భంగా అరవిందబాబు ఆదివారం స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో ఆయన నివాసంలో సమావేశమై పంచాయతీ ఎన్నికల నిర్వహణ, కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయావకాశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ.. నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా అధిష్ఠానం అరవిందబాబును నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. అరవిందబాబు మార్గ నిర్దేశకత్వంలో నియోజకవర్గవ్యాప్తంగా మెజారిటీ పంచాయతీల్లో కూటమి పార్టీల మద్దతుదారులే తిరుగులేని విజయం సాధించబోతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ప్రతి పంచాయతీలో సమర్థులైన, ప్రజలకు సుపరిచితులైన అభ్యర్థులనే కూటమి పార్టీలు బలపరిచాయని, పార్టీలకు అతీతంగా జరిగే పల్లె పోరులోనూ విజయం తమనే వరించబోతోందని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.
ప్రత్తిపాటి నాయకత్వమే చిలకలూరిపేటకు నిజమైన బలం అని అరవిందబాబు పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నాయకుడు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వమే చిలకలూరిపేట ప్రజలకు నిజమైన బలమని, ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ ప్రజాసేవ, అభివృద్ధి కేంద్రీకృతంగానే ఉంటాయని చిలకలూరిపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. ప్రత్తిపాటి నాయకత్వంలో, నియోజకవర్గంలో కూటమి బలపరిచిన అభ్యర్థులు పంచాయతీల్లో తిరుగులేని విజయం సాధించబోతున్నారని అరవిందబాబు అన్నారు.
ఇప్పటికే 32 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన స్థానాల్లో ఎన్నిక నామమాత్రంగానే ఉండబోతాయని అరవిందబాబు తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, కొత్త కోటేశ్వరరావు, తోట బ్రాహ్మస్వాములు, తుపాకుల అప్పారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


